మసూద్‌కు చైనా అండ
- September 29, 2018
న్యూయార్క్ : ఉగ్రవాది అజర్ మసూద్‌కు చైనా మళ్లీ అండగా నిలిచింది. జేషే మొహమ్మద్ చీఫ్‌ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అందరి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్, పాక్ మధ్య ఒకేరకమైన అభిప్రాయాలు వ్యక్తం కావడం లేదని, ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే తాము మద్దతు ఇస్తామని చైనా మంత్రి తెలిపారు. భద్రతా మండలిలో పర్మనెంట్ సభ్య దేశమైన చైనా.. మసూద్‌ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంలో అడ్డు చెబుతోంది. భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో మసూద్ ప్రమేయం ఉందన్న విషయం తెలిసిందే. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా అడ్డుకున్నది. పఠాన్‌కోట్ దాడుల సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో భారత్ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదన చేసింది. అయితే అమెరికా మసూద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు సిద్ధమైంది. కానీ అప్పుడు చైనా తనకు ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్‌లైన్ ఇవ్వాలంటూ తెలిపింది. దాని ప్రకారమే అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించలేకపోయారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







