విశాల్ ‘పందెంకోడి 2’ ట్రైల‌ర్ విడుద‌ల‌

- September 29, 2018 , by Maagulf
విశాల్ ‘పందెంకోడి 2’ ట్రైల‌ర్ విడుద‌ల‌

దాదాపు పన్నెండు ఏళ్ల కిందట వచ్చిన ‘పందెంకోడి’ చిత్రం విశాల్ కెరీర్ లో భారీ హిట్ ను సాధించింది. తెలుగులో ఈ చిత్రం 175 రోజులు ఆడిందంటే అతిశయోక్తి కాదు. విశాల్‌–లింగుస్వామి కాంబినేషన్ కావడం, పైగా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు మామూలుగానే ఆదరణ ఉంటుంది. ఆ క్రమంలోనే పందెంకోడిని కూడ ఆదరించారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ పందెంకోడి 2 వస్తోంది. ఇందులో విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవల మహానటిలో అద్భుతమైన నటన కనబరచిన కీర్తి.. ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ట్రైలర్ రిలీజ్ చేశారు. మాస్‌ యాక్షన్‌ లో లవ్ ను మిళితం చేసిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే పందెంకోడి హవా మొదలైంది. కాగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 18 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com