10 ఏళ్ళ బాలికకు లైంగిక వేధింపులు: కార్మికుడికి జైలు
- September 29, 2018
10 ఏళ్ళ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అభియోగాల నేపథ్యంలో 24 ఏళ్ళ పాకిస్తానీ కార్మికుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. జూన్ 7 అల్ బర్షాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికను గట్టిగా కౌగలించుకుని, ఆమెను ముద్దాడినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. బాలిక బ్రిటిష్ జాతీయురాలు. శిక్ష ముగిసిన తర్వాత ఆ వ్యక్తిని డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యులు భోజనం చేసేందుకు ఒక్క చోట కూర్చున్న సమయంలో, బాలిక డల్గా వుండడం చూసి, ఆమె తండ్రి ఏమయ్యిందని అడగగా, జరిగిన విషయాన్ని తన తండ్రి దృష్టికి ఆ బాలిక తీసుకొచ్చింది. పెయింట్ చూడటానికి వెళ్ళిన తనను లైంగికంగా వేధించినట్లు బాలిక చెప్పడంతో, ఆమె తండ్రి పోలీసులకు విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. మరుసటి రోజు కార్మికుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







