ఎన్టీఆర్ బయోపిక్‌పై క్రిష్ సంచలన నిర్ణయం..
- October 01, 2018
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్…ప్రతిష్టాత్మకంగా నటసింహం బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమాలో, ఆయన జీవితంలో జరిగిన అన్ని బెస్ట్ మూమెంట్స్ ని తెరపైన చూపించడం కష్టమనే ఉద్ధేశ్యంతో, రెండు పార్టులుగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఆల్ రెడీ ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కి డేట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పక్కా ప్లానింగ్ తో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జరుగుతోంది. ఒకవేళ ఈ సినిమాని రెండు పార్టులుగా తీస్తే.. సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు తీస్తారు అనే అనుమానులు కూడా ఉన్నాయి. కానీ దర్శకుడు క్రిష్, బాలకృష్ణ మాత్రం ఫస్ట్ పార్ట్ రిలీజైన నెల రోజులలోనే సెకండ్ పార్ట్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో చాలా మంది స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలనే బసవతారకం పాత్ర పోషిస్తోంది. ఇక ఎఎన్ఆర్ గా సుమంత్, చంద్రబాబు నాయుడుగా రానా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, జయప్రదగా రాశీఖన్నా..ఇంకా ఎన్టీఆర్ టైమ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ని కూడా ఈ బయోపిక్ లో చూపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు, ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారని తెలియడంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా వస్తుందా లేదా అనే విషయంపై మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







