వైఫైతో పండ్లు, కూరగాయల మార్కెట్
- December 19, 2015
195 మిలియన్ దిర్హామ్‌లు వెచ్చించి నిర్మించిన సౌక్ అల్ జుబాలీ పండ్లు, కూరగాయలు, చేపల మార్కెట్‌ని షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కసిమి ప్రారంభించారు. ఈ కొత్త మార్కెట్‌ని 37,000 చదరపు మీటర్ల ప్రాంతంలో నిర్మించారు. మొదటి ఫ్లోర్‌లో మూడు సెక్షన్లుంటాయి. ఇక్కడ తాజా కూరగాయలు, పండ్లు లభిస్తాయి. రెండో ఫ్లోర్‌లో మాంసం లభ్యమవుతుంది. మూడో ఫ్లోర్‌లో చేపలు అందుబాటులో ఉంటాయి. మాంసం సెక్షన్‌లో 76 దుకాణాలు, వెజిటబుల్ ఫ్రూట్ సెక్షన్‌లో 212 దుకాణాల్ని ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో వైఫై సౌకర్యంతోపాటు వాక్ వే, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. నాలుగు ప్రధాన ద్వారాలు ఈ మార్కెట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్ ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో ప్రజలు మార్కెట్‌ని సందర్శించారు. సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్‌లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన







