న్యూ ఇయర్ వేడుకల్లో రికార్డ్ బ్రేకింగ్ ఫైర్ వర్క్స్
- October 05, 2018యూఏఈలో ప్రతి యేడాదీ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతాయి. అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్, యూఏఈని ప్రపంచ వ్యాప్తంగా 'పర్యాటక ప్రాంతం'గా మార్చేస్తున్నాయనడం నిస్సందేహం. ఈ ఏడాది కూడా, ప్రపంచ స్థాయి పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకుగాను రికార్డ్ స్థాయిలో ఫైర్ వర్క్స్‌తో ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. రస్ అల్ ఖైమాకి చెందిన ఫైర్ హోల్డ్ ప్రాజెక్ట్స్ మాస్టర్ డెవలపర్ మర్జాన్ 2019 సంవత్సరానికి అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్‌తో స్వాగతం పలికేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించడం జరిగింది. అల్ మర్జాన్ ఐలాండ్‌లో జరిగే ఈ ఫైర్ వర్క్స్ కోసం ఇప్పటినుంచే హోటల్ బుకింగ్స్ కూడా ప్రారంభమయిపోయాయి. ఫైర్ వర్క్స్‌తోపాటు ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్, ఫెస్టివ్ ప్రమోషన్స్.. ఇలా చాలా హంగులు న్యూ ఇయర్ వేడుకల కోసం ఏర్పాటు చేస్తారు. 2018 వేడుకలు రస్ అల్ ఖైమా, అల్ మర్జాన్ ఐలాండ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక