వీకెండ్‌ వెదర్‌ రిపోర్ట్‌: దుబాయ్‌, అబుదాబీల్లో ఫాగ్‌

వీకెండ్‌ వెదర్‌ రిపోర్ట్‌: దుబాయ్‌, అబుదాబీల్లో ఫాగ్‌

యూఏఈ:శుక్రవారం ఉదయం యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఫాగ్‌, మిస్ట్‌ కవర్‌ అయి కన్పించింది. ఈ కారణంగా రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. అబుదాబీ, దుబాయ్‌లలో ప్రధానంగా ఈ ఫాగ్‌, మిస్ట్‌ కారణంగా వాహనదారులు సమస్యల్ని ఎదుర్కొన్నారు. సోమవారం వరకు ఇదే పరిస్థితి వుండొచ్చని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ వెల్లడించింది. అత్యధిక ఉష్ణోగ్రతలు కోస్టల్‌ ఏరియాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు వుండొచ్చు. ఇంటర్నల్‌ ఏరియాస్‌లో మాత్రం 39 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వుంటుంది. సంబంధిత హ్యుమిడిటీ రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున ఎక్కువగా వుంటుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. అరేబియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ సముద్రాలు సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్‌నెస్‌తో వుండే అవకాశముంది. 

Back to Top