జిటెక్స్ షాపర్ ముగింపు: పోటెత్తిన షాపర్స్
- October 06, 2018
దుబాయ్:ఈ ఏడాది జిటెక్స్ షాపర్ నేటితో ముగియనుండడంతో షాపర్స్ పోటెత్తారు. కొనుగోలు దార్లతో ఆ ప్రాంతమంతటా సందడిగా మారింది. శుక్రవారం భారీగా జన సందోహం కన్పించింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద పొడవైన క్యూలు షాపర్స్‌తో నిండిపోయాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే ఈ జిటెక్స్ షాపర్‌లో లభిస్తుండడంతో వాటి పట్ల ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 300 దిర్హామ్‌లపైన ఖర్చు చేసేవారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







