ఎక్స్‌ఛేంజ్‌లో దొంగతనం: ఒకరి అరెస్ట్‌

- October 06, 2018 , by Maagulf
ఎక్స్‌ఛేంజ్‌లో దొంగతనం: ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: అల్‌ బతినా గవర్నరేట్‌ పోలీస్‌, ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఎక్స్‌ఛేంజ్‌ హౌస్‌లో నిందితుడు దొంగతనానికి పాల్పడినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. దొంగతనం చేయడం, అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి నేరాలు నిందితుడిపై మోపబడ్డాయి. విలాయత్‌ ఆఫ్‌ సహామ్‌లో ఈ ఘటన జరిగింది. కేసు విచారణ జరుగుతోందనీ, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌లో చేసిన ప్రకటన ద్వారా పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com