తెలంగాణ:కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీర్మానాలు ఇవే..

- October 06, 2018 , by Maagulf
తెలంగాణ:కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీర్మానాలు ఇవే..

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ''అక్టోబర్ 9లోగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలి. 14 నాటికి అభ్యర్థుల జాబితా ప్రకటించాలి. డిపాజిట్ కోల్పోయిన వారికి టికెట్ ఇవ్వొద్దు. రెండుసార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వొద్దు. విశ్వసనీయత, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలోనే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి హైకమాండ్‌కు లిస్టు పంపాలి. గెలిచే స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవద్దు. గెలుపు ప్రామాణికంగా పొత్తులు ఉండాలి.'' అని కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో సీపీఐకి ఇచ్చే సీట్లపై కూడా చర్చించారు. ఖమ్మంలో సీపీఐకి స్థానాలు ఇవ్వొద్దని నిర్ణయించారు. గత ఎన్నికల్లో సీపీఐకి మూడు స్థానాలు ఇస్తే డిపాజిట్‌ రాలేదని ఈ సమావేశంలో గుర్తు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com