ఆఫ్రికాలో ప్రమాదం...50 మంది అగ్నికి ఆహుతి
- October 06, 2018
ఆయిల్ ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోగా... 100 మందికి పైగా గాయాలపాలైన ఘటన ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో జరిగింది. రాజధాని కిన్షాసాకు 130 కిలోమీట్ల దూరంలోని ఎమ్ బుటా గ్రామం దగ్గర జాతీయ రహదారిపై ఓ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... ట్యాంకర్ లోని ఆయిల్ పక్కనే ఉన్న ఇళ్లపై పడడం మంటలు అంటుకోవడంతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్యాంకర్ వెనుక, ముందు ఉన్న కార్లు, ఇతర వాహనాలకు కూడా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో జరిగిన ప్రమాదం నుంచి తెరుకునే బయటపడే పరిస్థితి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది... దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







