హీరో విశాల్ టీంకు అడ్డంగా దొరికిపోయాడు!
- October 07, 2018
సినిమా ఇండస్ట్రీకి పైరీ పెద్ద సమస్యగా తయారైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకరకంగా పైరసీ జరుగుతూనే ఉంది. తాజాగా తమిళ స్టార్స్ విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో తెరెకెక్కిన '96' చిత్రం పైరసీ గురైంది. పైరసీ సైట్లలో పూర్తి చిత్రం లీకైంది.
ఓ వైపు పైరసీని అరికట్టేందుకు తమిళ నటీనటుల సంఘం అధ్యక్షుడు విశాల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో... అతడి టీమ్‌కు ఓ వ్యక్తి '96' సినిమాను పైరసీ చేస్తూ రెండ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. మినీ ఉదయం అనే థియేటర్లో ఈ సినిమాను తన ఫోనులో రికార్డు చేస్తుండగా... అదే థియేటర్లో ఉన్న విశాల్ టీం పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరో వైపు ఆన్ లైన్లో దర్శనమిస్తున్న '96' సినిమాకు సంబంధించిన పైరసీ లింకులపై యాంటీ పైరసీ టీం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని ఇంటర్నెట్ నుండి తొలగిస్తూ ఎక్కడి నుండి పైరసీ జరిగిందనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.
'96' సినిమా విషయానికొస్తే సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ డ్రామా. విజయ్ సేతుపతి, త్రిష, గౌరీ జి కిషన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమిళనాడు బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







