భార్యలను అనుమతించండి అని అంటున్న విరాట్
- October 07, 2018
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ అంశాన్ని కోహ్లీ మొదట ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం ఆ అధికారి ఈ విషయాన్ని వినోద్‌రాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీకి చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారికంగా అభ్యర్థనను పంపాలని టీమిండియా మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యాన్ని పాలకుల కమిటీ అడిగినట్లు సమాచారం. అయితే దీనిపై పాలకుల కమిటీ కొత్త బీసీసీఐ కార్యవర్గం ఏర్పడ్డ అనంతరమే నిర్ణయం తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







