సౌదీ కాన్సులేట్ సమీపంలో సౌదీ రచయిత అనుమానాస్పద మృతి

- October 07, 2018 , by Maagulf
సౌదీ కాన్సులేట్ సమీపంలో సౌదీ రచయిత అనుమానాస్పద మృతి

రియాద్‌: టర్కీలోని సౌదీ కాన్సులేట్‌ సమీపంలో ప్రముఖ సౌదీ రచయిత జమాల్‌ ఖషోగి శవమై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన దారుణహత్యకు గురై ఉంటారని సౌదీ ప్రభుత్వం అనుమానిస్తున్నది. అయితే, సౌదీ ఆరోపణలను టర్కీ ఖండించింది. జమాల్‌ మృతితో తమకు ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్లితే...గత మంగళవారం టర్కీలోని సౌదీ కాన్సులేట్‌కు జమాల్‌ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జాడ తెలియరాలేదు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న సౌదీ పోలీసులు జమాల్‌ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. టర్కీ పోలీసులు కూడా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సౌదీ కాన్సులేట్‌కు జమాల్‌ ఎందుకెళ్లారంటే... 
జమాల్‌ తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈవిషయమై పలు పత్రాల కోసం ఆయన దౌత్య కార్యాలయాన్ని సంప్రదించారు. విడాకుల అనంతరం ఆయన టర్కీ జాతీయురాలైన హటీజ్‌ సెన్సిజ్‌ను పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాన్సులేట్‌ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆయన సెన్సిజ్‌ను కూడా తనతోపాటు తీసుకెళ్లారు. దాదాపు 11 గంటల పాటు ఆమె కాన్సులేట్‌ బయటే ఉండిపోయినట్టు ఆరోపించారు. జమాల్‌ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. టర్కీ అధికారులే జమాల్‌ని హత్య చేసి ఉంటారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈహత్యకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. 

జమాల్‌ మృతిపై వాషింగ్టన్‌ పోస్ట్‌ తీవ్ర దిగ్భ్రాంతి 
జమాల్‌ మృతిపై వాషింగ్టన్‌ పోస్ట్‌ మీడియా సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జమాల్‌ తమ పత్రికకు పలు కథనాలు, ఆర్టికల్స్‌ అందించే వారని, ఆయన్ను ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. దోషులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఎర్డోగన్‌ ప్రభుత్వాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ డిమాండ్‌ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com