ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది దుర్మరణం
- October 07, 2018
అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 20 మంది చనిపోయారు. ఆల్బెనీ సమీపంలోని స్కోహరీ కౌంటీలో రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ ఎస్‌యూవీ తరహా పొడవాటి లిమౌసిన్ కారు రోడ్డు పక్కన పాదచారులను వేగంగా ఢీకొని ఓ స్టోర్‌లోకి దూసుకెళ్లింది. లిమౌసిన్ కారులో వివాహ రిసప్షన్‌కు వెళ్తున్న ఓ పెళ్లి బృందం ఉంది. చనిపోయిన 20 మందిలో కారులో ఉన్న వారు ఎంతమంది.. పాదచారులు ఎంతమంది.. అనే విషయాలతోపాటు చనిపోయిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాపిల్ బారెల్ కంట్రీ స్టోర్ అండ్ కేఫ్‌కు వెలుపల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం న్యూయార్క్‌కు 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదం సమయంలో లిమోనస్ వెహికిల్ పెళ్లి బృందాన్ని తీసుకు వస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







