ఇమామ్‌ హత్య కేసు అనుమానితుడికి మెంటల్‌ హెల్త్‌ టెస్ట్‌

- October 09, 2018 , by Maagulf
ఇమామ్‌ హత్య కేసు అనుమానితుడికి మెంటల్‌ హెల్త్‌ టెస్ట్‌

బహ్రెయిన్: ఇమామ్‌ హత్య కేసులో అనుమానితుడికి మెంటల్‌ హెల్త్‌ టెస్ట్‌ జరిపించాలన్న డిఫెన్స్‌ లాయర్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. 35 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి, ఇమామ్‌ని హత్య చేసినట్లుగా అభియోగాలు మోపబడ్డాయి. ఇమామ్‌ అబ్దుల్‌జలీల్‌ హమౌద్‌ని, రాడ్డుతో కొట్టి చంపిన నిందితుడు, ఆ తర్వాత ఇమామ్‌ మృతదేహాన్ని ముక్కలుగా నరికివేశాడు. ఆ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాల్ని ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌లో నింపి, అక్సర్‌లోని స్క్రాప్‌యార్డ్‌లో పడవేశాడు నిందితుడు. ఈ ఘటనలో మరో నిందితుడికి ఊరట లభించింది. ముహరాక్‌లోని మాస్క్‌లో నిందితుడు మ్యుజ్జిన్‌గా పనిచేస్తున్నాడు. అదే మాస్క్‌లో మృతుడు కూడా ఇమామ్‌గా పనిచేయడం జరిగింది. ఉచిత వీసాల్ని ట్రేడింగ్‌ చేస్తున్న ఇందితుడ్ని ఇమామ్‌ హెచ్చరించడంతోనే ఈ హత్య జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com