బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి మృతి
- October 09, 2018
బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి మరణించారు. 'నా జానే' అంటూ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన 'నిలె నిలె అంబర్ పర్ ..' సాంగ్ రీమిక్స్ తో ఎంతో పేరు గడించారు. ఆయన భార్య ప్రముఖ టీవీ నటి రోమా బాలి. నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన నితిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించారు. ముంబై, మాలాద్ నుండి బొరివిల్లి లో ఉన్న తన నివాసానికి వెళ్తున్న సమయంలో నితిన్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తలకు బాగా గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాక గాయాలకు చికిత్స చేసి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి చేరుకున్నాక వెంటనే రక్తపు వాంతులు చేసుకోవటం, హార్ట్ రేట్ తీవ్రంగా పడిపోవటం జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. హుటాహుటిన మళ్ళీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







