ప్రమాదంలో పడ్డ మహిళా ఉద్యోగులు

- October 09, 2018 , by Maagulf
ప్రమాదంలో పడ్డ మహిళా ఉద్యోగులు

ఓవైపు సమానత్వం, స్త్రీలకు సమానా అవకాశాలు అని మాట్లాడుతున్నా... పెద్ద సంఖ్యలో మహిళల ఉద్యోగాలు ఉడతాయంటోంది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌). పరిశ్రమల్లో యాంత్రీకరణతో రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది మహిళల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరింది. అత్యాధునిక నైపుణ్యాన్ని మహిళలకు నేర్పిస్తూ మహిళలను ప్రోత్సహించాలని పారిశ్రామిక వేత్తలకు సూచించింది ఐఎంఎఫ్‌. 30 దేశాల్లో మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని... ఆయా రంగాలకు సంబంధించిన వివరాలను తాజాగా బాలీలో జరిగిన ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడించింది ఐఎంఎఫ్‌. ఆ నివేదికల్లో పేర్కొన్న ప్రకారం... రానున్న రెండు దశాబ్దాల్లో 70 శాతం పరిశ్రమలు యాంత్రీకరణను పూర్తి చేసుకుంటాయని... దాంతో 30 దేశాల్లో 10 శాతం ఉద్యోగాల్లో కోతపడనుందని తెలిపింది. కోత పడే ఉద్యోగులలో మహిళా ఉద్యోగులే ఎక్కువగా ఉంటారని... ఇందులో 40 ఏళ్లు పైబడిన, క్లరికల్‌, సేవలు, సేల్స్‌ రంగాల్లో ఉన్న మహిళలపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com