కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే
- October 10, 2018
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను కమిటీ ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ 105 మందితో కూడిన భారీ జాబితాను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను మొదటి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.
ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 12న యూపీఏ చైర్‌పర్సన్ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థుల బలాబలాలపై చర్చించి ఐదు రాష్ట్రాల అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే:
సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్
రేవంత్‌రెడ్డి - కొడంగల్
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
కొండా సురేఖ - పరకాల
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
కూన శ్రీశైలంగౌడ్ - కుత్బుల్లాపూర్
సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్
ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్
షబ్బీర్ అలీ - కామారెడ్డి
సుదర్శన్‌రెడ్డి - బోదన్
శ్రీధర్‌బాబు - మంథని
మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్
జీవన్‌రెడ్డి - జగిత్యాల
బలరాంనాయక్ - మహబూబాబాద్
దొంతుమాధవరెడ్డి - నర్సంపేట
గీతారెడ్డి - జహీరాబాద్
దామోదర రాజనర్సింహ - ఆందోల్
జానారెడ్డి - నాగార్జునసాగర్
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్
ఉత్తమ్ పద్మావతి - కోదాడ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు
సురేష్ షెట్కర్ - నారాయణ్‌ఖేడ్
రమేష్ రాథోడ్ - ఖానాపూర్
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్
వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి
డీకే అరుణ - గద్వాల
సంపత్ - ఆలంపూర్
ఆరేపల్లి మోహన్ - మానకొండూరు
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి
భట్టి విక్రమార్క - మధిర
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి