విరాట్ కోహ్లీపై విరుచుకుపడుతున్న నెటిజన్లు

- October 10, 2018 , by Maagulf
విరాట్ కోహ్లీపై విరుచుకుపడుతున్న నెటిజన్లు

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీపై మరోసారి నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఓ యువతితో ఫోటో దిగే విషయంలో కోహ్లీ చేసిన పనిని అందరూ విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే… ఓ ప్రముఖ గడియారాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన కోహ్లీ.. ఆ కంపెనీ నిర్వహించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈవెంట్ కి వచ్చిన అతిధులకు స్పోర్ట్స్ స్టార్స్ లో ఒక్కొక్కరికి స్వయంగా వాచ్ లు అందజేస్తూ ఫొటోలు దిగాడు. ఈ క్రమంలోనే టెన్నిస్ యువ క్రీడాకారిణి కర్మాన్ కౌర్తో కలిసి పోజిచ్చేందుకు సిద్ధమైన విరాట్..

ఆమెకంటే ఎత్తులో చిన్నగా ఉన్న విరాట్… ఇద్దరం ఒకే ఫ్రేమ్లో కనబడాలని పక్కనే ఉన్న పోడియంపైకి ఎక్కి ఫొటోలకు పోజిచ్చాడు. కాగా ఈ ఫోటోను, వీడియోను చూసిన నెటిజన్లు చూసి నెటిజన్లు సామాజికమాద్యమాల్లో విరుచుకు పడుతూ కోహ్లీపై మండిపడుతున్నారు. 'ఎందుకంత అహంకారం.. మహిళ కంటే పొట్టిగా ఉంటే వచ్చే నష్టమేంట'ని ఒకరు.. '29 ఏళ్ల కోహ్లీ ఎత్తు 175 సెం.మీ..

20 ఏళ్ల కర్మాన్ కౌర్ ఎత్తు 183 సెం.మీ. అయినా ఈ ఫొటోలో కోహ్లీనే ఎత్తుగా కనబడుతున్నాడు… టిస్సాట్ ప్రచారానికి ఇదెలా ఉపయోగపడుతుంది' అంటూ మరొకరు.. 'ఇదెంత అవమానం.. ఓ ప్రముఖ క్రికెటరైన విరాట్ ఇలా చేయడమా..సిగ్గుపడాలి' అని ఇంకొకరు ట్వీట్లు చేస్తున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com