ఐరా... నయన్ విశ్వరూపం..

- October 10, 2018 , by Maagulf
ఐరా... నయన్ విశ్వరూపం..

నయనతార, దక్షిణాది చిత్రాలలో తన మేటి నటనతో ఆస్కార్ దాకా నామినేట్ అయిన నటి. ఆమె తలైవి గా తమిలనాట కీర్తిని అందుకుంది. వంద కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక నాయికగా నిలిచింది. సరైన సబ్జెక్ట్ లు ఎంచుకుని లేడీ ఓరిఎంటెడ్ హీరోయిన్ గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. నయన్ అంటే అందమే కాదు అభినయం కూడా. ఇలా రెండూ కలబోసి వెండి తెరపై బంగారు కాసులని పండించడంలో సిధ్ధహస్తురాలు నయన్.

ఆమే లేటెస్ట్ మూవీ పై ఇపుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నయన్ తాజా మూవీ ఐరా.. ఇది నయన్ నటిస్తున్న 63వ చిత్రం. దీన్ని యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ మూవీ డిసెంబర్ లో తెలుగు తమిళ్ భాషల్లో క్రిస్మస్ కానుకగా ఒకేమారు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నయన్ ద్విపాత్రల్ని ఎలివేట్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

ఆమె పోషిస్తున్న పాత్రలు రెండు అని ఐరా ఫస్ట్ లుక్ చెబుతోంది.

అయితే ఆమె వేసేది కవలల పాత్రలా లేక నాయికా, ప్రతి నాయిక పాత్రల పోషణా అన్నది అర్ధం కావడం లేదు. ఫస్ట్ లుక్ బాగా డిజైన్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఇంటెరెస్ట్ బాగా పెంచేశారు. ఈ మూవీ గురించి ఫిల్మ్ మేకర్స్ అంటున్న మాట ఏంటంటే నయన్ కచ్చితంగా జతీయ అవార్డ్ ని కొడుతుందట. ఆమె నటన పతాక స్థాయిలో ఉంటుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com