దుబాయ్ ఎయిర్ పోర్ట్స్.. పాస్పోర్ట్ లేకుండానే
- October 11, 2018
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ మీదుగా ప్రయాణించే ఫస్ట్ క్లాస్ మరియు బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు పాస్పోర్ట్ లేకుండానే తమ ప్రయాణాల్ని ఎంజాయ్ చేయొచ్చు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) - దుబాయ్, దుబాయ్ ఎయిర్ పోర్ట్ 3వ టెర్మినల్ వద్ద స్మార్ట్ టన్నెల్ని ఏర్పాటు చేసింది. కేవలం 15 సెకెన్లలో పాస్పోర్ట్ కంట్రోల్ ప్రొసిడ్యూర్స్ని పూర్తి చేసే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది. పాస్పోర్టులపై స్టాంప్ అవసరం లేకుండా బయోమెట్రిక్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ప్రయాణీకులు ఈ స్మార్ట్ టన్నెల్లో వెళ్ళొచ్చు. టన్నెల్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా పని పూర్తి చేస్తుంది టన్నెల్. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, ఇది ప్రస్తుతానికి ట్రయల్ ఫేజ్లో వుందనీ, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ మక్తౌమ్ ఈ స్మార్ట్ విధానాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారనీ చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







