సూయజ్ రాకెట్‌కు ప్రమాదం.. ఇద్దరు ఆస్ట్రోనాట్లకు తప్పిన ముప్పు
- October 11, 2018
న్యూయార్క్: ఇద్దరు ఆస్ట్రోనాట్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ మధ్యలోనే చెడిపోవడంతో కజక్‌స్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా బయటపడ్డారు. రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెక్సీ ఓవ్‌చినిన్, అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ ప్రమాదంలో జరిగిన సమయంలో అందులో ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లడానికి బయలు దేరిన ఈ రాకెట్ బూస్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు సిబ్బంది బాలిస్టిక్ డీసెంట్ మోడ్‌లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా ట్వీట్ చేసింది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా వెల్లడించింది. సూయజ్ రాకెట్‌లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్‌ఎస్‌కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్‌లో ఉండాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







