"సంథింగ్ ఈస్ రాంగ్" - 'విశ్వామిత్ర' టీసర్
- October 11, 2018
రాజ్ కిరణ్ సినిమా బ్యానర్ పై రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వామిత్ర'. నందితరాజ్, ప్రసన్నకుమార్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. యూఎస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని హారర్, థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా 'విశ్వామిత్ర' టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో నందితను చూస్తుంటే 'త్రిపుర' సినిమాలో స్వాతిని చూసినట్టుగా అన్పిస్తోంది. ఎందుకంటే త్రిపుర సినిమాలో స్వాతి లుక్, విశ్వామిత్రలో నందిత లుక్ ఒకేలాగా ఉన్నాయి. ఇక ఈ టీజర్ చూస్తుంటే 'ప్రేమకథా చిత్రం'లో దెయ్యం ప్రాతలో అలరించిన నందిత ఈ సినిమాలో కూడా భయపెట్టబోతోందా ? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి