ఈ నెల 20న తెలంగాణలో కాంగ్రెస్ భారీ సభ!

- October 11, 2018 , by Maagulf
ఈ నెల 20న తెలంగాణలో కాంగ్రెస్ భారీ సభ!

తెలంగాణ:తెలంగాణలో ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా ఈ నెల 20న జిల్లాలో రాహుల్‌ గాంధీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభ నిర్వహణకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ కలెక్టర్‌, ఎస్పీలకు వినతి పత్రాలను అందజేశారు.

కామారెడ్డి: తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం కామారెడ్డి జిల్లా నుంచే మొదలు పెట్టనున్నారు. ఈ నెల 20 వ తేదిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాహూల్‌గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కోన్నాయి. రాహూల్‌గాంధీ సభకు సంబంధించి హైదారాబాద్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం జరుగనుంది. అదే విధంగా కామారెడ్డి పట్టణంలో జరిగే రాహూల్‌గాంధీ సభకు అనుమతికై ఉమ్మడి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ కమిటి జిల్లా కలెక్టర్‌ , ఎస్పీ దరఖాస్తు చేశారు. జిల్లాలో రాహూల్‌గాంధీ పర్యటన కన్‌ఫాం అయినట్లు శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ఆలీ ఆంధ్రజ్యోతితో పేర్కోన్నారు.

సభ ఏర్పాట్లలో కాంగ్రెస్‌ నేతలు..

తెలంగాణలో ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. నార్త్‌ తెలంగాణలో కామారెడ్డి జిల్లా నుంచి రాహుల్‌గాందీ ఎన్నికల ప్రచారానికి శంఖరావాన్ని పూరించనున్నారు. రాహుల్‌గాంధీ పర్యటనకు సంబంధించి అటు రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటితో పాటు ఇటు ఉమ్మడి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20న సాయంత్రం కామారెడ్డి పట్టణంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

బహిరంగ సభను పట్టణంలోని ప్రభుత్వ సైన్స్‌అండ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించాలని, పార్కింగ్‌కు స్థానికంగా ఉన్న సీఎస్‌ఐ గ్రౌండ్‌ను ఏర్పాటు చేయాలని, రెండు హెలిపాడ్‌లు ల్యాండ్‌ అయ్యేందుకు ఇంధిరాగాంధీ స్టేడియంను కేటాయించాలంటు కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అనుమతికై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ కమిటి అధ్యక్షుడు తాహెర్‌బీన్‌హూందాన్‌,గంగాధర్‌, యెండల కిషన్‌లు కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డిలకు ధరఖాస్తు చేశారు. అదే విధంగా రాహుల్‌ సభకు సంబంధించి జన సమీకరణ, ఏర్పాట్లు ఎలా చేయాలి అనే దానిపై ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ ము ఖ్యనేతలు నిమగ్నమయ్యారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగే ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ సభకై చర్చించేందుకు హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో రాష్ట్ర నేతలు భేటి కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నేృతత్వంలో రాష్ట్రస్థాయి నేతలయిన జానారెడ్డి, షబ్బీర్‌ఆలీ, బట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, విజయశాంతి, డి.కె. అరుణలతో పాటు ఇతర నేతలు సమావేశం కానున్నట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ, రాహుల్‌గాంధీ పర్యటన ఖరారు కావడంతో హుటాహూటిన హైదారాబాద్‌కు ప్రయణమయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రాహూల్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని, ఈ నెల 20న కామారెడ్డిలోను బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు షబ్బీర్‌ఆలీ 'ఆంధ్రజ్యోతి'తో తెలిపారు. సభకు సంబంధించి కాంగ్రెస్‌ పూర్తి ఏర్పాట్లు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com