ఎల్ఐసీ మరో సంచలన పద్ధతి

- October 12, 2018 , by Maagulf
ఎల్ఐసీ మరో సంచలన పద్ధతి

ఈరోజుల్లో ఎల్ ఐ సీ లో డబ్బులు పెట్టాలి అంటే చాలామంది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఎల్ ఐ సీ పాలసీలు మరియు ఇన్సూరెన్స్ లు చేయించడం వల్ల మనకు కాకపోయినా మన వారికోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజుల్లో ఎల్ఐసీ కి పోటీగా ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి కస్టమర్లకి ఎన్నో సదుపాయాలు కలిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎల్ఐసీ మిగతా కంపెనీలకు ధీటుగా ఇప్పుడు రివైవల్ పద్దతి తీసుకొచ్చింది.

పాలసీ బాగుందనో, స్నేహితులో, బంధువులో ఒత్తిడి చేస్తున్నారనో పాలసీలు తీసుకోవడం చాలామందికి అలవాటు. రెండుమూడేళ్లు ప్రీమియం గడువులోగా కట్టినా ఆ తర్వాత పట్టించుకోరు. దీంతో ఆ పాలసీలన్నీ ల్యాప్స్ అవుతాయి. ఆలస్య రుసుముతో చెల్లించాలన్నా సాధ్యం కాదు. దీంతో అలాంటి పాలసీల విషయంలో ఏం చేయాలో పాలసీదారులకు అర్థం కాదు. వారి కోసమే అప్పుడప్పుడూ ఎల్ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ నిర్వహిస్తుంటాయి. మరోసారి ఎల్‌ఐసీ స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ ప్రారంభించింది.

లాప్స్ అయిన ఎల్ఐసి పాలసీ రివైవ్ చేసుకోండి ఇలా

ఇక భారతదేశంలో అతిపెద్ద భీమా సంస్థ ఎల్ఐసి.ఇక ఎల్ఐసీ వినియోగదారులకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అది ఏంటి అంటే లాప్స్ అయిన మీ పాలసీలు మళ్ళీ మీకు చెల్లించే అవకాశం తీసుకొస్తోంది.

ఇక ఈ లాప్స్ అయిన పాలసీలు తిరిగి చెల్లించేందుకు ఈ నెల అక్టోబర్ 15 వరకు గడువు ఉంది అని ఎల్ఐసీ అధికారులు వెల్లడించారు. ఇక ఏ ఏ పాలసీలు తిరిగివస్తాయి అంటే మీ వ్యక్తిగత పాలసీలు మరియు హెల్త్ పాలసీలు తిరిగి చెల్లిస్తారు. ఇక మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు రివైవల్ చేయడం కుదరదు.

ఇక 802 803 804 811 835 యూలిప్ పాలసీలు రివైవ్ చేయచ్చు అలాగే పాలసీలు రివైవ్ చేయించుకుంటే ఆలస్యరుసుములో మినహాయింపు ఉంటుంది. ఇక ప్రీమియం ఒక రూ.1 లక్ష కన్నా తక్కువైతే ఆలస్య రుసుములో 20 శాతం లేదా రూ.1500 వరకు రాయితీ ఉంటుంది. ఇక ప్రీమియం రూ. లక్ష కన్నా ఎక్కువ మూడు లక్షల వరకు ఉంటే ఆలస్య రుసుములో 25 శాతం లేదా రూ.2000 వరకు రాయితీ ఉంటుంది.ఇక ప్రీమియమ్ రూ.మూడు లక్షలు పైన ఉంటే ఆలస్య రుసుములో 25 శాతం లేదా రూ.2500 వరకు రాయితీ వస్తుంది.

బకాయిలు మొత్తం చెల్లించినవారికి ఆలస్యరుసుములో మినహాయింపు ఉంటుంది. ఎస్ బి కమ్ రివైవల్, లోన్ కమ్ రివైవల్ ఇంస్టాల్మెంట్ రివైవల్ పైన ఆలస్య రుసుము మినహాయింపు ఉంటుంది. ఇక రివైవల్ సమయంలో హెల్త్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సిఉంటుంది. ఇక ఇతర మరియు పూర్తి వివరాలకోసం మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసీ కార్యాలయాలలో వెళ్లి రివైవల్ గురించి తెలుసుకోండి. ఇక పాలసీ రివైవల్ చేయించుకొనేందుకు ఆఖరి గడువు అక్టోబర్ 15 .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com