మానవ హక్కుల మండలిలో ఇండియా కు స్థానం.!

- October 12, 2018 , by Maagulf
మానవ హక్కుల మండలిలో ఇండియా కు స్థానం.!

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు తగిన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యున్నత మానవ హక్కులసంస్థ అయిన ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) మానవ హక్కుల సంస్థకు భారత్‌ ఎన్నికైంది. మానవ హక్కుల మండలి(యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ అత్యధిక ఓట్లతో నెగ్గింది.

ఆ మండలి సభ్యత్వం కోసం జరిగిన పోల్‌లో భారత్ 188 ఓట్లు సాధించింది. ఆసియా పసిఫిక్ క్యాటగిరీలో భారత్‌కు ఈ గౌరవం దక్కడం విశేషం. మానవ హక్కుల మండలిలో భారత్ మూడేళ్ల సభ్యత్వం దక్కించుకుంది. 2019, జనవరి 1వ తేదీ నుంచి ఈ సభ్యత్వం అమలులోకి వస్తుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి.

మానవ హక్కుల మండలిలో 18 మంది కొత్త సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో 97 ఓట్లు రావాల్సి ఉండగా, మనదేశానికి 188ఓట్లు పోలయ్యాయి. యూఎన్‌ సాధారణ అసెంబ్లీలో శుక్రవారం 18దేశాలు కొత్తగా ఎన్నికయ్యాయి. ఆసియాపసిఫిక్‌ ప్రాంతం నుంచి ఐదుదేశాలకు స్థానం ఉండగా మన దేశంతో పాటు బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, ఫిజి, ఫిలిప్పీన్స్‌ ఎన్నికయ్యాయి. భారత్ విజయం అంతర్జాతీయంగా మన దేశ ప్రమాణాన్ని సూచిస్తుందని యూఎన్ అంబాసిడర్ సయ్యిద్ అక్బరుద్దీన్ తెలిపారు. మద్దతు తెలిపిన మిత్రదేశాలకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతూ యూఎన్ అంబాసిడర్ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com