మూడింటినీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..రాహుల్
- October 20, 2018
తెలంగాణలో రాహుల్ సమరభేరి మోగించారు. మొదట బైంసా, తరువాత కామారెడ్డి సభలతో కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నింపారు. ముఖ్యంగా కామారెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్, మోడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఇద్దరూ అవినీతిలో పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాలపై నడిచిన ఉద్యమంతోనే తెలంగాణ ఏర్పాటైందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కానీ ఆ మూడింటినీ కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దాదాపు ఐదేళ్ల పాలనలో కేసీఆర్ అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మంటగలిపారని రాహుల్ మండిపడ్డారు.
ప్రాజెక్టుల రీ డిజైన్‌లో తీవ్ర అనివీతి జరిగిందని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాణిహిత పేరు మార్చి ఆయనను అవమానించారన్నారు. కేవలం ప్రాజెక్టుల పేరు మార్చి.. కోట్లు కొల్లగొట్టారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రైతులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం కోసం పోరాటం చేసిన రైతులకు కేసీఆర్ బేడీలు వేయించారని రాహుల్ మండిపడ్డారు.
తాజా వార్తలు
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!







