'పెట్ట' షూటింగ్ పూర్తి
- October 20, 2018
'కాలా' చిత్రం అనంతరం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'పెట్ట'. ఎవరూ ఊహించని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. త్రిష, సిమ్రాన్, విజయ్‌సేతుపతి, బాబిసింహా, శశికుమార్, సీనియర్ దర్శకుడు మహేంద్రన్ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. డార్జిలింగ్, కులూమనాలి, వారణాసి, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందని సూపర్‌స్టార్ రజనీకాంత్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'పెట్ట' చిత్రీకరణ పూర్తయింది. అనుకున్న దానికన్నా 15 రోజులు ముందుగానే ఈ పని కానిచ్చేశారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, ఇతర యూనిట్ సభ్యులకు అభినందనలు. అందరికీ పండుగ శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండటం విశేషం. ఇటీవల 'కాలా'తో వచ్చిన రజనీకాంత్... నవంబరు ఆఖరులో '2.ఓ'తో అలరించనున్నారు. రెండు నెలల గ్యాప్‌లోనే మళ్లీ ప్రేక్షకులను 'పెట్ట' తో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







