సిగరెట్ పొగతో నిండిన గదిలో శ్రియ..
- October 22, 2018
అందాల తార శ్రియ శ్రీమతిగా మారిన తరువాత వస్తున్న మొదటి చిత్రం వీర భోగ వసంత రాయలు. ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న శ్రియ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న శ్రియ ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించినట్లు చెప్పింది.
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు గది అంతా సిగరెట్ పొగతో నిండిపోయిందని తెలిపింది. పొగకు గది ఉన్నవారంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఇలాంటి సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ సినిమా రిజల్ట్ చూసి అవన్నీ మరచిపోతామని చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది అని చిత్ర నిర్వాహకులు తెలియజేసారు. ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పారావ్ బెల్లాన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







