48 గంటల్లో విడోస్‌, డివోర్స్‌డ్‌ విమెన్‌ వీసా రెన్యువల్‌

- October 22, 2018 , by Maagulf
48 గంటల్లో విడోస్‌, డివోర్స్‌డ్‌ విమెన్‌ వీసా రెన్యువల్‌

దుబాయ్‌:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ (జిడిఆర్‌ఎఫ్‌ఎ), దుబాయ్‌ ఫెస్టివల్‌ సిటీలోని తమ సెంటర్‌ని విడోస్‌, డివోర్స్‌డ్‌ విమెన్‌ వీసాల ప్రాసెసింగ్‌ కోసం కేటాయించనుందని అధికారులు తెలిపారు. విడోస్‌, డివోర్స్‌డ్‌ విమెన్‌, వారి పిల్లలకి స్పాన్సర్‌ లేకుండా ఏడాదిపాటు వీసా గడువు పెంచుతూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ సెంటర్‌ని వినియోగించనున్నారు. జిడిఆర్‌ఎఫ్‌ఎ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎంట్రీ పర్మిట్స్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ జసెమ్‌ అలి అహిల్‌ మాట్లాడుతూ, 12 మంది మహిళా ఉద్యోగులు, ఈ సెంటర్‌లో సేవలందిస్తారని చెప్పారు. ఈ కేసులు సెన్సిటివ్‌ అనీ, ప్రైవసీ వుండాల్సినవి కాబట్టి, వీటిని ప్రత్యేకంగా డీల్‌ చేస్తామని అన్నారాయన. కేవలం 48 గంటల్లోనే వీసా రెన్యువల్‌ ప్రాసెస్‌ని పూర్తి చేస్తారు. డివోర్స్‌ లేదా డెత్‌ సర్టిఫికెట్లను వీసా ప్రాసెసింగ్‌ కోసం సమర్పించాల్సి వుంటుంది. 100 దిర్హామ్‌ల ఫీజు చెల్లించాలి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకు ఈ సెంటర్‌ తెరిచి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com