1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- October 23, 2018
యూ.ఏ.ఈ:భారత వలసదారుడు సౌరవ్ దేవ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలె విజేతగా నిలిచారు. 1 మిలియన్ డాలర్లను ఈ రఫాలెలో ఆయన గెల్చుకున్నారు. దుబాయ్‌లో స్థిరపడ్డ 45 ఏళ్ళ డే, 3070 నెంబర్ టిక్కెట్‌ని 284 సిరీస్ ద్వారా పొందారు. ఆ టిక్కెట్‌కి బంపర్ ప్రైజ్ తగిలింది. ఆరేళ్ళుగా సౌరవ్ డే దుబాయ్‌లో వుంటున్నారు. ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఆయన డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌లో కోల్‌కతాకి వెళుతూ దుబాయ్ రఫాలె టిక్కెట్‌ని కొనుగోలు చేశారు సౌరవ్. ఈ రఫాలెలో మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వాహనాలు దక్కాయి. శ్రీలంక జాతీయుడు సంజీవ నిరంజన్, రేంజ్ రోవర్ హెచ్‌ఎస్‌ఇ 380 హెచ్‌పి వాహనాన్ని గెల్చుకోగా, మరో భారతీయ వలసదారుడు బాబు అజిత్ బాబు బిఎండబ్ల్యు ఆర్ 1200 ఆర్‌టి మోటార్ బైక్‌ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







