యూ.ఏ.ఈ:ఆమ్నెస్టీ పిరియడ్‌లో పొడిగింపు లేదు
- October 23, 2018
అబుదాబీ: మూడు నెలల అమ్నెస్టీ అక్టోబర్ 31తో ముగియనుంది. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ మార్పులు చేస్తే తప్ప, అక్టోబర్ 31 గడవులో ఎలాంటి మార్పు వుండబోదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆమ్నెస్టీ పొడిగింపుపై ప్రస్తుతం ఎలాంటి చర్చలూ జరగడంలేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) అధికార ప్రతినిథి లెప్టినెంట్ అహ్మద్ అల్ దలాల్ చెప్పారు. ప్రస్తుతానికి పొడిగింపుపై ఎలాంటి చర్చలూ జరగడంలేదనీ, ఒకవేళ పొడిగింపు ఆలోచనలు ఏమైనా వుంటే ఫెడరల్ అథారిటీ ప్రకటన చేస్తుందనీ, ఈలోగా వచ్చే రూమర్స్‌ని ఎవరూ నమ్మరాదని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ 1న అమ్నెస్టీ ప్రారంభమయ్యింది. తస్హీల్, అమెర్ సెంటర్స్‌లో ఇల్లీగల్ రెసిడెంట్స్ తాలూకు అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఎలాంటి జరీమానాలూ లేకుండా దేశాన్ని వదిలి వెళ్ళడానికీ, రెసిడెన్సీ స్టేటస్‌ని రెగ్యులరైజ్ చేయడం వంటివి ఈ ఆమ్నెస్టీ పీరియడ్‌లో జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







