'ITCA' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 23, 2018
ఇటలీ:తేది 21 అక్టోబర్ 2018 ఆదివారం రోజున “ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA)” ఆధ్వర్యంలో “రోం” లోని కాళీమందిర్ దేవాలయ ప్రాంగణంలో సుమారు 200 మంది తెలుగు బిడ్డల నడుమ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా "బతుకమ్మ సంబరాలు" ఎంతో అట్టహాసంగా జరిగాయి.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడడంతో ఆలయ ప్రాంగణం అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది.
ఇతర దేశాలకు చెందిన మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటలీలో దొరికే వివిద రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి విదేశీవనితలు రోజంతా ఆడిపాడారు.
ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ పిన్నమరెడ్డి సౌమ్యరెడ్డి, నల్లయగరీ అశ్వినిరెడ్డి, ITCA వ్యవస్థాపకులు కొక్కుల మనోజ్ కుమార్, నరబోయిన రాహుల్ రాజ్, మరియు ఇతర సభ్యులు ఆడెపు అనుదీప్, ప్రణవ్, తదితరులు పాల్గొన్నారు.
_1540311573.jpg)
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







