ఇండియా లో హ్యూందాయ్ కొత్త మోడల్ ..
- October 23, 2018
దక్షిణా కోరియా కార్ల దిగ్గజం హ్యూందాయ్ మార్కెట్లోకి మరో సరికోత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న హ్యుందాయ్ కొత్త శాంట్రో కారు వచ్చేసింది. ప్రస్తుతం ఈ కారు బడ్జెట్ ధరతో కస్టమర్స్‌ను ఆకట్టుకుంటోంది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. అయితే కొన్ని కారణాల వలన శాంట్రోను హ్యూందాయ్ మార్కేట్ నుంచి వెనిక్కి తీసుకొంది. వినియోగదారులకు మరో కొత్త మోడల్‌ను అందించాలని ఉద్దేశంతో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. మంగళవారం షారుఖ్ ఖాన్‌తో ఈ కొత్త మోడల్‌ను
లాంచ్ చేశారు. ప్రారంభ ఆఫర్ కింద తొలి 50,000 మంది కస్టమర్లకు రూ.11,100కే కారును బుక్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కలిపించింది.. ఈ సరికొత్త శాంత్రో ధర రూ. 3.7 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.
ఫీచర్లు..
* ఆధునిక హ్యాచ్‌బ్యాక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ కారును డిజైన్ చేశారు.
* వెనుక సీట్లలలో కూడా ఏసీ సౌకర్యాన్ని కల్పించారు.
* స్పోర్ట్స్, ఆస్టా రకాల్లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అందుబాటులో ఉంది.
* ఈ కారులో 4-సిలిండర్ మోటార్‌తో 1.1లీటర్ ఎప్సిలాన్ ఇంజిన్ ఉంది.
* బీఎస్-6 నిబంధనలకు అనుకూలంగా ఈ కారును రూపొందించారు.
* కారు మైలేజీ లీటర్‌కు పెట్రోలుతో 20.3 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..