16 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్
- October 24, 2018
ఇస్లామాబాద్ : సరిహద్దులను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 16 మంది భారత జాలర్లను పాకిస్తాన్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారని ఆ దేశ భద్రతా దళాలు బుధవారం వెల్లడించాయి. పాకిస్తాన్ తీర ప్రాంత భూభాగాన్ని ఉల్లంఘించి, తమ జలాల్లోకి జాలర్లు చొరబడ్డారని, సముద్రంలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా గుర్తించామని మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(ఎంఎస్ఎ) తెలిపింది. వారి పడవలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. జాలర్లను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించామని పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







