వెంకీ తో సినిమా చేయనున్న 'నేను లోకల్' డైరెక్టర్
- October 24, 2018
'ఎఫ్ 2'తో బిజీగా వున్నారు వెంకటేష్. ఈ సినిమా తర్వాత ఆయన కొత్త సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. త్రివిక్రమ్ తో సినిమా అటు ఇటుగా వుంది. అయితే ఇప్పుడు ఆయన లైన్ లోకి మరో దర్శకుడు వచ్చాడు. అతడే త్రినాథరావు నక్కిన.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు త్రినాథరావు నక్కిన. రామ్‌తో తెరకెక్కించిన 'హలో గురు ప్రేమ కోసమే' కూడా హిట్ అనిపించుకుంది. అందుకే త్రినాథరావుకి మరో బంపర్ ఆఫర్ దక్కింది. త్వరలోనే వెంకటేష్‌తో కలసి ఓ సినిమా చేస్తున్నారాయన.
కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. డి.సురేష్ బాబు భాగస్వామిగా ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇది వెంకీ స్టైల్‌లో సాగే పూర్తి వినోదాత్మక చిత్రమని సమాచారం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







