ఎతిహాద్‌ విమానంలో మహిళ ప్రసవం

- October 24, 2018 , by Maagulf
ఎతిహాద్‌ విమానంలో మహిళ ప్రసవం

ముంబయి:యూఏఈలోని అబుదాబీ నుంచి ఇండోనేషియాలోని జకార్తా వెళ్తోన్న ఎతిహాద్‌ విమానంలో బుధవారం ఉదయం ఇండోనేషియాకు చెందిన మహిళ ప్రసవించింది. మెడికల్‌ ఎమర్జెన్సీ కావడంతో ఈవై 474 విమానాన్ని వెంటనే ముంబయికి మళ్లించారు. ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ల్యాండ్‌కాగానే మహిళను అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డకు చికిత్స అందించామని, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర ల్యాండింగ్‌ వల్ల విమానం రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుతున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com