విశాఖ వన్డే: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ టై

- October 24, 2018 , by Maagulf
విశాఖ వన్డే: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ టై

విశాఖ: ఉత్కంఠతో అభిమానులను ఊపేసిన విశాఖ వన్డే చివరి టై అయింది. కోహ్లీసేన నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్‌ ప్రాణం పెట్టింది. ఒక్క పరుగు తేడాతో విజయాన్ని దూరం చేసుకుంది.

కరీబియన్‌ జట్టుదే సునాయాస గెలుపు అనుకున్న వేళ టీమిండియా విజృంభించింది. ఆఖరి పది ఓవర్లను కట్టుదిట్టంగా విసిరింది. పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీస్తూ తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి ఓవర్‌లో విండీస్‌ 14 పరుగులు చేయాలి. ఉమేశ్‌ యాదవ్‌ బౌలర్‌. ఒత్తిడి చంపేస్తున్నా షై హోప్‌ (123; 134 బంతుల్లో 10×4, 3×6) అజేయంగా నిలిచాడు. భారీ షాట్లు ఆడలేకపోయినా ఒక్కో పరుగు తీశాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా బౌండరీ బాది మ్యాచ్‌ను టై చేశాడు. అతడి సహచరుడు హెట్‌ మెయిర్‌ (94; 64 బంతుల్లో 4×4, 7×6) చెలరేగి ఆడాడు. వీరిద్దరి బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని విండీస్‌ సమం చేసింది. అంతకు ముందు కోహ్లీ (157 నాటౌట్‌; 129 బంతుల్లో 13×4, 4×6), అంబటి రాయుడు (73; 80 బంతుల్లో 8×4) చెలరేగి ఆడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com