అమ్మగా నయన్
- October 24, 2018
తమిళనాడుకు ఆమే అమ్మ. ఆమె చనిపోయి రెండేళ్ళు కావస్తోంది. అయినా ఆమె పట్ల జనం అభిమానం ఎక్కడా చెక్కుచెదరలేదు. తమిళ సినీ, రాజకీయ సామ్రాజ్యాధినేత్రిగా చిరకాల కీర్తిని గడించిన అమ్మ పేరు మీద సినిమా తీయాలని చాలాకాలంగా అనుకుంటున్న సంగతి విధితమే. ఇపుడు అది కార్య రూపం దాల్చుతోంది అంటున్నారు.
అంతటా ఇపుడు బయోపిక్ ల యుగం నడుస్తోంది. ఏపీలో అన్న నందమూరి పేరిట రెండు చిత్రాలు రూపొందుతున్నాయి. యాత్ర పేరు మీద వైఎస్సార్ బయోపిక్ వస్తోంది. ఇదే కోవలో తమిళ నాట జయలలిత బయోపిక్ తీసేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అమ్మ పాత్రలో సంచలన తార నయనతార నటిస్తారన్నది లేటెస్ట్ టాక్.
ఇప్పటికే అనేక భిన్నమైన పాత్రలు పోషించి తన సత్తా చాటుకున్న నయన్ కి ఇది సవాల్ లాంటిదేనని అంటున్నారు. అమ్మగా నయయ్ విశ్వరూపం చూపిస్తుందని కూడా చెబుతున్నారు. నయన్ అభినయం, అందం అచ్చం జయలలితను దివి నుంచి భువిని తీసుకువస్తాయని కూడా ఫిల్మ్ మేకర్స్ తో పాటు ఈ న్యూస్ విన్న వారంతా గాఢంగా నమ్ముతున్నారు.
ఈ మూవీకి హిట్ చిత్రాల డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. పందెం కోడి 2 హిట్ తో మంచి ఊపు మీద ఉన్న లింగు స్వామి అమ్మ మూవీ కోసం అపుడే రంగంలోకి దిగిపోయాడు. ఈ మూవీ చేసేందుకు నయన్ ఒప్పుకోవడమే అసలైన హిట్ అంటున్నారు. మరి చూడాలి రేపటి రోజున వెండితెరపై అమ్మగా ఎలా నయన్ అలరిస్తుందో.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







