దుబాయ్ బీచ్‌లో స్పెషల్ రైడ్
- October 24, 2018
థ్రిల్ కోరుకునేవారికి దుబాయ్ బీచ్‌లో మరో ఆకర్షణీయమైన రైడ్ అందుబాటులోకి వచ్చింది. యాక్షన్ స్పోర్ట్ బ్రాండ్ ఎక్స్ దుబాయ్ స్లింగ్ షాట్, కైట్ బీచ్‌లో అక్టోబర్ 26న అందుబాటులోకి వస్తుంది. ఓ వ్యక్తికి 280 దిర్హామ్‌ల ఖర్చుతో ఈ థ్రిల్ అందించనున్నారు. దీంతోపాటుగా 50 దిర్హామ్‌ల వోచర్ ఉచితంగా లభిస్తుంది. దీన్ని ఎక్స్ దుబాయ్ షాప్‌లో రిడీమ్ చేసుకోవచ్చు. సింగిల్ రైడర్స్ కోసం ఈ రైడ్‌ని డిజైన్ చేశారు. గురువారం, శుక్రవారం, శనివారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 1 గంట నుంచి 7 గంటల వరకు మాత్రమే ఈ రైడ్ అందుబాటులో వుంటుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దుబాయ్ బీచ్‌లో ఇసుక మీదుగా, సముద్రం మీదుగా స్లింగ్ అవడం ఈ రైడ్ ప్రత్యేకత.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







