ఫేస్ బుక్ కు భారీ జరిమానా..!
- October 25, 2018
లండన్ : కేంబ్రిడి ఎనలిటికా కుంభకోణంలో ఫేస్‌బుక్ పాత్ర ఉన్నట్టు బ్రిటన్‌కు చెందిన సమాచార కమిషన్ కార్యాలయం (ఐసీఓ ) వెల్లడించింది. వినియోగదారుల సమాచారం ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటంలో విఫలమైందని పేర్కొంది. ఈమేరకు డేటా పరిరక్షణ విభాగం ఫేస్‌బుక్ యాజమాన్యానికి 500,000 పౌండ్లు ( రూ.4,70, 25,072 ) భారీ జరిమానా విధించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణంలో ఫేస్‌బుక్ పాత్ర ఉన్నందుకే ఈ జరిమానా విధించినట్టు స్పష్టం చేసింది. చాలా తీవ్రమైన తప్పిదానికి ఫేస్‌బుక్ ఆస్కారం కల్పించిందని ఐసీఓ అభిప్రాయపడింది. పాత డాటా భద్రతా చట్టాల ప్రకారం అత్యధిక జరిమానాను ఫేస్‌బుక్‌కు విధించారు. సరైన పరిమితులు విధించకుండా యాప్ డెవలపర్లకు ఫేస్‌బుక్ వినియోగదార్ల డేటాను అందించిందని ఐసీవో చెప్పింది. '2007-2014 మధ్య ఫేస్‌బుక్ తమ వినియోగాదర్ల వ్యక్తిగత సమాచారాన్ని అనుచితంగా యాప్ డెవలపర్లకు అందించింది. దానికోసం వినియోగదార్ల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోని వాళ్ల సమాచారాన్ని కూడా అది అందించింది' అని ఐసీవో వివరించింది. వినియోగదార్ల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని వెల్లడించింది. 'ఐసీవో పరిశీలనలోని కొన్ని అంశాలను మేం గౌరవంగా తిరస్కరిస్తున్నాం. కేంబ్రిడ్జ్ ఎనలిటికాపై మేం మరింత లోతైన విచారణ చేయాల్సి ఉందని గతంలోనే చెప్పాం' అని ఫేస్‌బుక్ తన ప్రకటనలో పేర్కొంది.పరిశోధకుడు డాక్టర్.అలెగ్జాండర్ కోగన్‌కు చెందిన జీఎస్‌ఆర్ సంస్థ... ఫేస్‌బుక్‌లో ఒక పర్సనాలిటీ క్విజ్ ద్వారా దాదాపు 8.7కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. ఇందులో కొంత డాటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో పంచుకుంది. ఆ డేటాను అమెరికా రాజకీయ ప్రకటనల కోసం ఉపయోగించారు. ఈ సమాచార దుర్వినియోగాన్ని 2015లోనే గుర్తించినప్పటికీ ఫేస్‌బుక్ సరైన చర్యలు తీసుకోలేదని ఐసీవో తెలిపింది. ఫేస్‌బుక్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించింది' అని యూకే సమాచార కమిషనర్ ఎలిజబెత్ డెన్హామ్ అన్నారు. డాటాను రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వినియోగిస్తారనే దానిపై ఐసీఓ విచారణ కొనసాగిస్తోంది.
10లక్షల మంది బ్రిటన్ పౌరుల సమాచారం లీక్ : 10లక్షల మంది బ్రిటన్ పౌరుల సమాచారం ఫేస్‌బుక్ తస్కరించిందని ఐసీవో పేర్కొంది. తాము ఫేస్‌బుక్‌పై విధించిన జరిమానా చాలా చిన్న అంశమేనని తెలిపింది. గతేడాది ఫేస్‌బుక్ ఆదాయం 40.7బిలియన్ డాలర్లని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..