బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ చేసిన పనికి కంపెనీ ఫైర్
- October 25, 2018
నటీనటులు, సెలబ్రెటీలు కంపెనీ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. సేల్స్ పెంచుకునేందుకు కంపెనీలు యాడ్స్ మీద ఆధారపడుతుంటాయి. నిజంగా ఆ యాడ్లో నటించిన వాళ్లు వాడుతుంటారో లేదో తెలియదు కానీ ఇది వాడ్డం వల్లే నేను తెల్లగా అయ్యాను, ఇది తాగడం వల్లే నేనింత ఉత్సాహంగా ఉన్నాను అంటే పోలో మని ఆ వస్తువులు కొనేస్తుంటారు. ఫోన్ల విషయానికి వస్తే ఖరీదు తక్కువగా ఉండి, మన్నికగా ఉంటూ ఫీచర్లు ఎక్కువ వుంటే దాన్ని తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఈ విషయాలన్నీ చెప్పడానికి కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చి ఆ వస్తువు పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేస్తుంది. రష్యాకు చెందిన మోడల్ క్సేనియా సోబ్చక్ శాంసంగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
యాడ్లో ఈ ఫోన్ వాడండి అని చెప్పడం బాగానే ఉంది కానీ తను మాత్రం ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ వాడి అడ్డంగా బుక్కయింది. ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఆమె మొబైల్ చేతబట్టుకుని వచ్చింది. అక్కడకు వచ్చిన తరువాత గుర్తొచ్చినట్టుంది. ఆపిల్ ఫోన్ దాచే ప్రయత్నం చేసింది. అయితే కెమేరా కన్నునుంచి తప్పించుకోలేకపోయింది. దీంతో శాంసంగ్ సంస్థ ఆమెకు 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా విధించింది. (భారత్ కరెన్సీలో రూ.11,71,84,000). గతంలోనూ ఇదే విషయమై వివాదంలో చిక్కుకుంది. తమ కంపెనీ పరువు తీస్తుందని భావించిన శాంసంగ్ సంస్థ క్సేనియాకు భారీ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్