దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కి సిద్ధమా?
- October 25, 2018
దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ నేటితో ప్రారంభమవుతోంది. 30 రోజుల ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కోసం యూఏఈ అంతటా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిట్‌నెస్‌పై ఏ మాత్రం అవగాహన, ఆసక్తి లేని అనురూమా ముఖర్జీ అనే వ్యక్తి.. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా అయినా తనకు ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీన్ని చాలా స్మార్ట్ ఇనీషియేటివ్ అని ఆమె కొనియాడారు. సాధారణంగా తాను 30 నిమిషాలపాటు నడుస్తుంటాననీ, ఇకపై ఆ నడకను 45 నిమిషాలకు పెంచుతానని వివరించారామె. మెడిటేషన్, ఎక్సర్‌సైజ్‌లు వంటివి కూడా చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు ముఖర్జీ. అల్ జలీలా ఫౌండేషన్‌లో పనిచేసే మరియా బగ్నులో మాట్లాడుతూ, ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తనకు ఎంతో ఉపయోగపడిందనీ, తనతోపాటు తన టీమ్ అంతటికీ ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేలా చేసిందని అన్నారు. మరియా మరియు ఆమె టీమ్, పలు ఈవెంట్స్‌ని నిర్వహించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం వాకథాన్‌ని, ట్రయాథ్లాన్‌నీ, మారథాన్లను కూడా నిర్వహించారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న సైకా అన్వర్ మాట్లాడుతూ, టీచర్లుగా తాము ఫిజికల్ స్ట్రెస్‌ని అనుభవిస్తుంటామనీ, ఫిట్‌నెస్ ఛాలెంజ్ తమకు మానసికంగా, శారీరకంగా ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







