మస్కట్ ఎక్స్‌ప్రెస్ వేపై తొలి రిటెయిల్ ఫ్యూయల్ స్టేషన్ త్వరలో
- October 25, 2018
మస్కట్:మస్కట్ ఎక్స్‌ప్రెస్ వేపై తొలి రిటెయిల్ ఫ్యూయల్ స్టేషన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ స్టేషన్ ద్వారా 1.4 మిలియన్ రోడ్ యూజర్స్‌కి సేవలందించవచ్చునని అంచనా వేస్తున్నారు. మస్కట్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణించే వాహనదారులు ఓ సర్వీస్ స్టాప్ కోసం చాన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. బయాన్ ఇన్వెస్ట్‌మెంట్ హౌస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీల్ మాట్లాడుతూ, ఈ రిటెయిల్ సెంటర్ హైవేపై అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సర్వీస్ స్టేషన్ అనీ, 1.4 మిలియన్ హైవే యూజర్స్‌కి ఇది ఉపయోగకరంగా వుంటుందని ఆయన వివరించారు. కురుమ్ నుంచి హల్బాన్ వరకు 54 కిలోమీటర్ల మేర ఈ మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే వుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!