ఆన్లైన్ లో ఉచితంగా 10 వేల కోర్సులు..

- October 27, 2018 , by Maagulf
ఆన్లైన్ లో ఉచితంగా 10 వేల కోర్సులు..

ప్రపంచంలోని దేని గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో మనముందు ఉంచుతుంది ఇంటర్నెట్. అభిరుచి, ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్‌లైన్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటారు. కొత్తవి నేర్చుకుంటారు. అలాంటి వారికోసమే ఆన్‌లైన్ శిక్షణ కూడా మొదలైంది. కొన్ని సంస్థలు నామ మాత్రపు రుసుము వసూలు చేస్తుంటే మరికొన్ని ఉచితంగానే అందిస్తున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్, హార్వార్డ్ యూనివర్సిటీలు, ఉచిత ఆన్‌లైన్ కోర్సుల్ని ప్రవేశపెట్టి ఔత్సాహికుల్ని ఆకర్షిస్తున్నాయి. సైన్స్ మొదలుకొని, సంగీతం వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా నేర్పిస్తున్నారు. వీటిని మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్‌ (ఎంఓఓసీ) గా పిలుస్తున్నారు. జాజ్, పియాన్, కోర్డ్ వంటి సంగీత వాద్య పరికరాలపై ఫ్రీగా ఆన్‌లైన్ కోర్సులు నిర్వహిస్తున్నారు. బోస్టస్లోని బర్కిలీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్.. గిటార్ వాద్యంలో 4 వారాల ఉచిత కోచింగ్ అందిస్తోంది.

హర్వార్డ్ యూనివర్సిటీ వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం వంటి విషయాలను, నెదర్లాండ్స్ లోని డెల్ఫిట్ యూనివర్సిటీ విశ్వగమనాన్ని అర్థం చేసుకోవడం, రోబోలతో లాభాలు, నష్టాలు.. వంటి విషయాలను ఉచితంగా అందిస్తున్నాయి. 2012లో మొదలైన ఫ్రీ ఆన్‌లైన్ కోర్సుల పరంపర ఈ ఏడేళ్లలో 800 యూనివర్సిటీలు 10 వేల కోర్సుల్ని డిజైన్ చేశాయి. కొన్నింటిని ఉచితంగా, మరికొన్నింటిని నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com