సారీ మోడీ..రాలేను - ట్రంప్
- October 28, 2018
వాషింగ్టన్: వచ్చే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఇండియా పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా అధికారులు ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్‌కు చేరవేసినట్లు సమాచారం. ఆ సమయంలో అమెరికాలోనే కొన్ని ముఖ్యమైన పనులు ఉన్న కారణంగా ట్రంప్ రాలేకపోతున్నారని అమెరికా అధికారులు వివరించారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంతోపాటు, ఇతక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొనాల్సి ఉంది. ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నందుకు చింతిస్తున్నానని ట్రంప్ అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ట్రంప్‌కు ఇండియా అధికారిక ఆహ్వానం పంపించింది.
అప్పుడే తమకు ఆహ్వానం అందినట్లు తెలిపిన అమెరికా.. దీనిపై సెప్టెంబర్‌లో రెండు దేశాల మధ్య జరగబోయే 2+2 సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ మధ్య కాలంలో ఇరాన్ ఆయిల్, రష్యాతో రక్షణ ఒప్పందాల నేపథ్యంలో ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా ఆహ్వానాన్ని తిరస్కరించడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







