నాని రిస్క్ తీసుకున్నట్టే!

- October 27, 2018 , by Maagulf
నాని రిస్క్ తీసుకున్నట్టే!

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. ఈమధ్యనే త్రివిక్రం గెస్ట్ గా ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాలో నాని క్రికెటర్ గా కనిపిస్తాడని తెలిసిందే. కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం నాని రిస్క్ తీసుకుంటున్నాడట.

ఈమధ్య వరుస విజయాలు సాధించడంతో నాని రేంజ్ తో పాటుగా రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు. ఈ క్రమంలో జెర్సీ సినిమాకు కూడా బాగానే డిమాండ్ చేశాడట. అయితే కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి రెమ్యునరేషన్ రూపంలో కాకుండా సినిమా లాభాల్లో వాటా అడిగాడట. అంటే జెర్సీ సినిమాకు రెమ్యునరేషన్ వద్దని చెప్పి లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పాడట.
రెమ్యునరేషన్ కోసం పెట్టే మొత్తాన్ని సినిమా ఎక్కడ రాజీ పడకుండా తీయాలని కండీషన్ పెట్టాడట. దర్శక నిర్మాతలు కూడా నాని పెట్టిన ప్రపోజల్స్ కు సరే అన్నట్టు తెలుస్తుంది. లాభాల్లో 50 శాతం వాటా ఇచ్చేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారట. జెర్సీ సూపర్ హిట్ అయితే నానికి రెమ్యునరేషన్ డబుల్ వచ్చినట్టు.

ఒకవేళ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకుంటే మాత్రం సినిమా ఫ్రీ చేసినట్టు అవుతుంది. అంటే సినిమా కోసం నాని పడిన కష్టం అంతా వృధా అయినట్టే. అందుకే కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా తీయాలని చెప్పాడట. రెమ్యునరేషన్ లేకుండా చేయడం అంటే కచ్చితంగా నాని రిస్క్ తీసుకున్నట్టే లెక్క.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com