ఏ ఆధారం లేకుండా 46 అంతస్థులు.. బతుకు మీద ఆశలు!!
- October 28, 2018
లండన్:స్పైడర్ మ్యాన్ గురించి కథల్లో చదువుకున్నాము. సినిమాల్లో చూశాము. ఎత్తైన భవనాలను ఏ ఆధారం లేకుండా ఎక్కేస్తాడు. ఒక బిల్డింగ్ పై నుంచి మరో బిల్డింగ్‌పైకి అవలీలగా దూకేస్తాడు. అది గ్రాఫిక్స్ మాయాజాలం. మరి నిజ జీవితంలో అలా చేసే వాళ్లుంటారా అంటే.. నేనున్నానంటున్నాడు లండన్‌కి చెందిన అలైన్ రాబర్ట్. ఏ సపోర్టు లేకుండా 46 అంతస్థుల బిల్డింగ్‌ని ఎక్కేసాడు. అదేమంటే ఇలా ఎక్కడం నాకెంతో ఇష్టం.. చాలా ఈజీ సార్ అంటున్నాడు. రెండో ఫ్లోర్‌కి వెళ్లాలన్న లిప్ట్ వచ్చేదాకా ఎంతసేపైనా వెయిట్ చేస్తుంటాము. టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు మెట్లెక్కి వెళదామని ఆలోచించం. అలాంటిది మెట్లు కూడా ఎక్కకుండా ఈ బిల్డింగులు ఎక్కడం ఏంటో అని చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అంత ఎత్తునుంచి పడ్డావంటే ఎముకలు కూడా మిగలవ్ అని అన్నాకాని.. నాకేం కాదు మీరేం భయపడకండి అంటున్నాడు. రాబర్ట్ ఎక్కిన ఈ బిల్డింగ్ లండన్‌లోనే మూడో అతి పెద్ద బిల్డింగ్. ఇంత అజాగ్రత్తగా బిల్డింగ్ ఎక్కినందుకు 46 అంతస్తుకు చేరుకున్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అరెస్ట్‌వ్వడం కూడా కొత్త కాదు. ఇప్పటికే 120 సార్లు అరెస్టయ్యాడు. ప్రపంచంలోని అతి పెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా, సిడ్నీలోని ఒపేరా హౌజ్, ఈఫిల్ టవర్‌లను కూడా ఇలాగే ఎక్కాడు. అందుకే రాబర్ట్‌కి ఫ్రెంచ్ స్పైడర్ మ్యాన్ అని పేరు.
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







