రూ.100కోట్లతో ప్రముఖుల భద్రతకు బెల్జియం ఆయుధాలు

- October 28, 2018 , by Maagulf
రూ.100కోట్లతో ప్రముఖుల భద్రతకు బెల్జియం ఆయుధాలు

ప్రముఖుల భద్రత కోసం బెల్జియం దేశానికి చెందిన అధునాతన ఆయుధాల ను కొనుగోలు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులతో పాటు ఎస్‌పిజి రక్షణ లో వున్న వివిఐపిల కోసం త్వరలో ఈ ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్రం వంద కోట్ల రూపాయలను వెచ్చించేందుకు నిర్ణయించింది. ప్రముఖుల భద్రత కల్పిస్తున్న ఎస్‌పిజి కమెండోల వద్ద ప్రస్తుతం గ్లాక్‌ పిస్ట ళ్లు, ఎంపి 5 సబ్‌ మెషిన్స్‌తో పాటు ఎకె 47, ఎకె 56 తుపాకులు వున్నాయి. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంతో పాటు తీవ్ర వాద సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖుల భద్రత కల్పించడం భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం దేశానికి చెందిన ఎఫ్‌.ఎన్‌ పిస్టళ్లతో పాటు ఫైవ్‌ సెవన్‌ పి 90 సబ్‌ మిషిన్స్‌ తెప్పించేందుకు కేం ద్రం నిర్ణయించింది. ఈ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఇప్పటికే బెల్జియం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రెండు మూడు నెలల్లో ఈ ఆయుధాలు ఎస్‌పిజి కమెండోలకు అం దుబాటులోకి రానున్నాయని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com